The Raja Saab: రాజాసాబ్ మొదటి పాటకు డేట్ లాక్!

The Raja Saab: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ చిత్రం నుంచి మొదటి పాట విడుదల తేదీ ఖరారైంది. అదిరిపోయే ఎనర్జీతో కనిపిస్తున్న ప్రభాస్ పోస్టర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఈ నవంబర్ 23న పాట రిలీజ్ కానుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రాబోయే సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.
దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ జానర్ చిత్రం ది రాజాసాబ్‌లో ప్రభాస్ టైటిల్ రోల్లో కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ విడుదలకు మేకర్స్ సిద్ధమయ్యారు. కలర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్‌లో స్టైలిష్ లుక్‌లో ప్రభాస్ కనిపిస్తూ డ్యాన్స్ స్టెప్ వేస్తూ ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ ఎనర్జిటిక్ పోస్టర్‌తోనే ఫ్యాన్స్‌లో హైప్ పెంచేశారు. నవంబర్ 23న ఈ మొదటి పాట గ్రాండ్‌గా విడుదల కానుంది. సంగీత దర్శకుడు ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.



