‘కాంతార చాప్టర్ 1’ సంచలనం!

Kantara Chapter 1: రిషబ్ శెట్టి ‘కాంతార’ ప్రీక్వెల్ ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఓటీటీలోనూ స్ట్రీమవుతూ రికార్డులు బద్దలు కొడుతోంది.
కన్నడ సినిమా ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ రిలీజ్ అయినప్పటి నుంచి బాక్సాఫీస్ దగ్గర ఏకధాటిగా రన్ సాగుతోంది. రిషబ్ శెట్టి దర్శక-నటుడిగా మరోసారి తన సత్తా చాటాడు. దేవత్వం, సంస్కృతి, ఆచారాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇటీవల ఈ సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ మైలురాయి సాధించిన సందర్భంగా చిత్రబృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఇప్పటికే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతూ అదే జోష్ కొనసాగిస్తోంది. కన్నడ సినిమా పరిధిని దాటి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇంకా థియేటర్లలో ఆడుతూ రికార్డులు నమోదు చేస్తోంది.



