సినిమా

మహేష్ ఫ్యాన్ కుటుంబానికి ఎస్‌కేఎన్ సాయం!

సూపర్‌స్టార్ మహేష్ బాబు హార్డ్‌కోర్ అభిమాని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇక్కట్లలో పడటంతో నిర్మాత ఎస్‌కేఎన్ స్పందించారు. ఆ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు.

ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు హార్డ్‌కోర్ ఫ్యాన్ ఇటీవల మరణించడంతో ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌కేఎన్ వెంటనే స్పందించి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు.

పిల్లల చదువులు, భవిష్యత్తు కోసం ఈ సహాయం చేశారు. గతంలోనూ చాలా సందర్భాల్లో ఇలా SKN కష్టాల్లో ఉన్న అభిమానులను ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ మానవతా దృక్పథంతో ఎస్‌కేఎన్ నెట్టింటా ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు SKNను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button