తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. జడ్చర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తో పాటు వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు ఆహ్వానించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపనులను ఆయన సీఎంకు వివరించారు.



