తెలంగాణ
Kavitha: కవిత ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగింపు.. జాగృతి నేతల ఆగ్రహం

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాగృతి నాయకులు పట్టణ వ్యాప్తంగా కవిత ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. అయితే రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు ఆ హోర్డింగులు, ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై జాగృతి నేతలు, ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



