ఆంధ్ర ప్రదేశ్
ప్రపంచ కప్ విజేత శ్రీ చరణికి కడపలో ఘన స్వాగతం

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో అభినందనలు అందుకున్న లెఫ్ట్ ఆర్మ బౌలర్ శ్రీ చరణి సొంత గడ్డ కడపలో అడుగుపెట్టింది. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కడప చేరుకున్న శ్రీ చరణికి ఘన స్వాగతం పలికారు జిల్లా వాసులు. సొంత గడ్డకు చేరుకున్న శ్రీ చరణికి వైఎస్ఆర్ క్రీడా మైదానంలో జిల్లా అధికారులు, క్రికెట్ అసోషియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవి, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. శ్రీ చరణి రాక సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారులను సుందరంగా ముస్తాబు చేశారు. సన్మానం అనంతరం శ్రీ చరణిని ఊరేగించారు క్రీడాభిమానులు.



