ఆంధ్ర ప్రదేశ్
కాశీబుగ్గలో ఆలయంలో తొక్కిసలాట.. పదిమంది మృతి

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదిమంది భక్తులు చనిపోగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఇవాళ కార్తీక మాసం, ఏకదాశి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.



