ఆంధ్ర ప్రదేశ్
చాక్లెట్ ఆశ చూపి.. చిన్నారిపై లైంగిక దాడి

కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఎనిమిది ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. తన పిల్లలతో ఆడుకునే ఓ చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని చాకుతో బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు షేక్ చాన్ భాషా.
వినాయక చవితి నుంచి దీపావళి వరకు బాలికపై పలుమార్లు అత్యాచారం జరగగా ఈ నెల 21న ఈ విషయం బయటపడింది. దీంతో కుటుంబసభ్యులు, స్థానికులు నిందితుడు షేక్ చాన్ భాషాకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నిందితుడిని కోర్టు లో హాజరుపరిచేందుకు నడి రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో నిందితుడిని హాజరు పరచగా.. చాన్ భాషాకు రిమాండ్ విధించింది న్యాయస్థానం.



