ఆంధ్ర ప్రదేశ్

నాగబాబుకు మంత్రి పదవిపై పవన్‌ సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan: నాగబాబుకు మంత్రి పదవి పైనా పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనతో ప్రయాణించిన వారిని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గత ఎన్నికల్లో తనతో సమానంగా నాగబాబు పనిచేశారని.. వైసీపీ నేతలతో ఎన్నో తిట్లుపడ్డారని, పార్టీ కోసం నిలబడికొట్లాడారని అన్నారు. తనకు కులం, బంధు ప్రీతి అన్న మాటలే గిట్టవన్న పవన్ కల్యాణ్ పనిమంతుడా కాదా అన్నది మాత్రమే తాను చూశానన్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో నాగబాబుకు అవకాశమివ్వాలని నిర్ణయించినా, చివరి నిమిషంలో తప్పించామని అందుకే ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నామని చెప్పారు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా తన అన్నయ్య సొంతంగా ఎదిగారన్నారు. త్వరలో నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారని, మంత్రి పదవి విషయం తరువాత చర్చిస్తామన్నారు. కందుల దుర్గేష్ ఏ కులమో తనకు తెలియదన్న పవన్, పని తీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చానన్నారు. రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికమన్నారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్, తన వ్యక్తిగత కార్యదర్శి హరిప్రసాద్ కు ఎమ్మెల్సీ అవకాశమిచ్చానన్నారు. ప్రతిభ ఉన్నవారందరినీ గౌరవిస్తున్నానన్నారు. తన అన్నకు పదవిస్తుంటే తనను ప్రశ్నిస్తున్నారని, నాడు జగన్ విషయంలో ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ప్రతిభ ఉన్నవారికి పదవులిచ్చేందుకు వెనుకాడబోమన్నారు పవన్ కళ్యాణ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button