BC Reservation: BC రిజర్వేషన్ల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

BC Reservation: నేడు BC రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం SLPపై ధర్మాసనం విచారించనుంది. హైకోర్టు స్టే ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని 42శాతం బీసీ రిజర్వేషన్లకు అనుమతివ్వాలని సర్కార్ కోరింది. బీసీ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయని గవర్నర్, రాష్ట్రపతికి పంపించామని సర్కార్ తెలిపింది. 3 నెలలకు మించి బిల్లులు పెండింగ్‌లో ఉంటే ఆమోదం పొందినట్లేనని గతంలో సుప్రీంకోర్టు తీర్పును స్పెషల్ లీవ్ పిటిషన్లో సర్కార్ ప్రస్తావించింది.
సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీల రిజర్వేషన్ల భవితవ్యం ఆధారపడి ఉండటంతో అత్యున్నత ధర్మాసనం ఏ తీర్పు ఇస్తుందోనని రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలుపై హైకోర్టు స్టే విధించింది.
ఈ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్‌మెహతా ధర్మాసనం విచారించనున్నది. అయితే ప్రభుత్వ వాదనలు వినడాని కంటే ముందే తమ వాదనలను కూడా పరిగణనలోకి హైకోర్టులో పిటిషనర్ మాధవరెడ్డి ఇప్పటికే కెవియట్ పటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం తెలంగాణ ప్రజలతోపాటు బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.



