Kota Vinutha: శ్రీకాళహస్తి జనసేన నేత కోట వినూత సెల్ఫీ వీడియో విడుదల..

Kota Vinutha: శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. హత్యకు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర చర్చనీయాంశంగా మారింది . ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డితన ద్వారా వినుత ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం సంచలన చర్చకు దారి తీసింది.
వినుత కోట తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. జైలుకు వెళ్లామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారామె.
మనసునిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేక పోయినా మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది. రాయుడి చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది. కాబట్టే 19 రోజుల్లో బెయిలు ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బయలు వచ్చింది. విదేశాల్లో రూ లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు.
చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను. ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు శివయ్యకు తెలుసని అన్నారు. ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్ తో బయటకు వస్తామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టే మీడియా ముందుకు రాలేక పోతున్నామన్నారు. కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తానన్నారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందన్నారు.



