సినిమా

iBomma: ఐబొమ్మ సంచలన బెదిరింపు!

iBomma: తెలుగు సినిమా పరిశ్రమలో పైరసీ మళ్లీ వార్తల్లో నిలిచింది. కొత్త సినిమాలు థియేటర్‌లో విడుదలవ్వగానే ఇంటర్నెట్‌లో లీక్ అవుతున్నాయి. iBomma వెబ్‌సైట్‌ పోలీసులకు సవాల్ విసిరిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ పైరసీ రాకెట్‌ను పోలీసులు ఎలా అరికడతారు? పూర్తి వివరాలు చూద్దాం.

తెలుగు సినిమా పరిశ్రమలో పైరసీ గుండెల్లో గునపంలా గుచ్చుకుంటోంది. iBomma వంటి వెబ్‌సైట్లు కొత్త సినిమాలను విడుదలైన కొద్ది గంటల్లోనే ఇంటర్నెట్‌లో అందుబాటులోకి తెస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో విడుదలకు ముందే చిత్రాలు లీక్ అవుతున్నాయి. ఈ పైరసీ రాకెట్ నిర్మాతలను బ్లాక్‌మెయిల్ చేస్తూ, భారీ మొత్తాలు డిమాండ్ చేస్తోందని సమాచారం. దక్షిణాది చిత్రాలు ఈ వెబ్‌సైట్లకు ప్రధాన లక్ష్యంగా మారాయి. తెలంగాణ సైబర్ పోలీసులు ఇటీవల పైరసీ నెట్‌వర్క్‌లపై దాడులు చేసి, కొందరిని అరెస్టు చేశారు. iBomma నిర్వాహకులను కూడా త్వరలో పట్టుకుంటామని ప్రకటించారు.

అయితే, iBomma టీమ్ పోలీసులకు సవాల్ విసిరింది. సినిమా బడ్జెట్‌లో హీరోల రెమ్యూనరేషన్, విదేశీ షూటింగ్‌లపై ఖర్చులు తగ్గించాలని, టికెట్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని వాదించింది. ఈ వివాదాస్పద పోస్ట్ ఎప్పుడు వచ్చిందో తెలీదు గాని ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సినీ రంగంలో ఆందోళన నెలకొంది. మరి పోలీసులు ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button