తెలంగాణ

కొత్త తరహా మోసం.. సిగరెట్ ప్యాకెట్లలో అట్టముక్కలు

వికారాబాద్ జిల్లా తాండూర్ లో కొత్త తరహా మోసం దర్శనమిచ్చింది. సిగరెట్టు ప్యాకెట్లలో అట్ట ముక్కలు కనిపించాయి, దీంతో అమ్మేవారు, కొనేవారు ఆశ్చర్యానికి గురయ్యారు. తాండూరు పట్టణంలో సుమారు 20 నుంచి 30 దుకాణాల్లో కిరాణా దుకాణం, పాన్ షాప్ లలో పెద్ద గోల్డ్ ప్లాక్, చిన్న గోల్డ్ ప్లాక్ ప్యాకెట్లలో అట్టముక్కలు వచ్చాయి.

ప్రధానంగా ఓ కిరాణ షాపులలో గోల్డ్ ప్లాక్ ప్యాకెట్ల ప్యాకింగ్ ఓపెన్ చేసి అమ్మే క్రమంలో ఈ విషయం బట్టబయలైంది. పట్టణంలోనే ఐసిఎల్ అనే ఏజెన్సీ నియోజకవర్గం మొత్తంగా సిగరెట్లు పంపిణీ చేస్తుంది . అయితే వారి ఏజెంట్ల ద్వారా తీసుకున్న సిగరెట్లలో ఈ విధంగా రావడంతో ఏజెన్సీ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో ఏజెంట్లను వివరణ అడగగా ఏజెన్సీకి రావాలని చెప్పినట్లుగా తెలిసింది. ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం ఈ ప్యాకెట్ల తమవి కావని బిల్లు ఉంటే చూపించాలని పొంతన లేని సమాధానం ఇచ్చారు. అయితే తాండూర్లో ఏజెన్సీ వాళ్ళు ఒరిజినల్ బిల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ విషయంపై పోలీసులకు కొందరు వ్యాపారస్తులు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button