ఆంధ్ర ప్రదేశ్
Gudivada Amarnath: స్టీల్‌ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం మాటతప్పింది

Gudivada Amarnath: కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తుందన్నారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధిక మెజారిటీ ఇచ్చినవారికి శఠగోపురం పెట్టారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే మద్దతు ఉపసంహరిస్తామని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌పై కూటమి సర్కార్ మాట తప్పిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.



