ఆంధ్ర ప్రదేశ్

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాబోయే మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

ఏపీలో నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button