సినిమా

అంకిత్, మానస జోడీతో ఆకట్టుకుంటున్న ‘లవ్ జాతర’ ఫస్ట్ లుక్

Love Jathara: యూజీ క్రియేషన్స్ బ్యానర్‌పై గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా ‘లవ్ జాతర’ చిత్రం రూపొందుతోంది. తాజాగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

యూజీ క్రియేషన్స్ బ్యానర్‌పై ‘సమ్మతమే’ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘లవ్ జాతర. అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది.

ప్రేమకథతో పాటు రోలర్ కోస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనున్న ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో హైలైట్‌గా నిలవనుంది. కంకణాల ప్రవీణ నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు. సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button