సినిమా

కన్నప్ప సినిమాకు సెన్సార్ సమస్యలు?

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భక్తి రసాత్మక చిత్రం ‘కన్నప్ప’ను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టాలీవుడ్‌లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం విడుదలకు సమీపిస్తుండగా, సెన్సార్ సమస్యలు తలెత్తాయి. ఈ మైథలాజికల్ చిత్రంలో బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన కొన్ని పాత్రలపై బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డు సభ్యులు చిత్రాన్ని పరిశీలించి, 13 సన్నివేశాలను తొలగించాలని సూచించారు. ఈ అంశంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. జూన్ 27న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం, భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button