War 2: ‘వార్ 2’ ఓటీటీ ఫిక్స్!

War 2: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందిన భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌కు ఊహించని స్పందన వచ్చింది.ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ హక్కులపై కీలక అప్డేట్ వచ్చేసింది.
‘వార్ 2’ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను అయాన్ ముఖర్జీ భారీ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన టీజర్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది.
అయితే, థియేటర్ రిలీజ్ తర్వాత ఈ చిత్రం ఓటీటీలో ఎక్కడ స్ట్రీమ్ అవుతుందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, హృతిక్‌పై పోస్ట్ చేస్తూ ‘ది వార్ ఈజ్ అఫీషియల్’ అంటూ నెట్‌ఫ్లిక్స్ సూచనాత్మకంగా హింట్ ఇచ్చింది.