తెలంగాణ
Rain: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain: హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మలక్పేట్, చాదర్ఘాట్, పంజాగుట్ట అండ్ మాదాపూర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలోనూ భారీ వర్షం కురుస్తోంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపుతో కూడిన వర్షాలు పడుతున్నాయి.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు.