సూర్య సినిమా అనూహ్య ట్విస్ట్!

Karuppu: స్టార్ హీరో సూర్య నటిస్తున్న కరుప్పు సినిమా విడుదల వాయిదా పడిందా? గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ డివోషనల్ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. సంక్రాంతి రేసు నుంచి సూర్య తప్పుకున్నాడని సమాచారం. పూర్తి వివరాలు చూద్దాం.
సూర్య నటిస్తున్న కరుప్పు చిత్రం విడుదలపై సందిగ్ధత నెలకొంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో డివోషనల్, సామాజిక అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. త్రిష కీలక పాత్రలో నటిస్తుండగా, శ్వాసిక, ఇందిరెన్స్, యోగి బాబు, సుప్రీత్ రెడ్డి వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2026 సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా, విజయ్ నటించిన జననాయకన్, శివకార్తికేయన్ చిత్రం పరాశక్తితో పోటీ పడే అవకాశం ఉండటంతో వాయిదా పడవచ్చని తెలుస్తోంది. సూర్య గత చిత్రం రెట్రో విజయం సాధించడంతో కరుప్పుపై అంచనాలు ఉన్నాయి.



