ఆంధ్ర ప్రదేశ్
Sharmila: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై స్పందించిన షర్మిల

Sharmila: మరోవైపు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ప్రవీణ్ పగడాల మృతికి కారణం రోడ్డు ప్రమాదం కాదన్నారు ఆమె. ఘటనాస్థలంలో హత్య అనడానికి చాలా రుజువులు ఉన్నాయంటున్నారు షర్మిల.
పక్కా ప్రణాళికతోనే హత్య చేశారంటూ షర్మిల ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు ప్రవీణ్ మృతిపై అందరికీ అనుమానాలు ఉన్నాయంటూ షర్మిల ట్వీట్లో రాసుకొచ్చారు. పగడాల ప్రవీణ్ మృతిపై ఫాస్ట్‌ట్రాక్ విచారణ జరిపించాలంటూ షర్మిల డిమాండ్ చేస్తున్నారు.