తెలంగాణ
Seethakka: బీఆర్ఎస్ విష ప్రచారాలకు జనం బుద్ధి చెబుతారు

Seethakka: 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ పంచాయతీరాజ్, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఖమ్మం పర్యటనలో సీతక్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ రాజశేఖర్ నగర్లో పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పేరుతో విమర్శలు చేస్తోందని సీతక్క విమర్శించారు.రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీతక్క స్పష్టం చేశారు.



