Australia Women Cricketers: ఆసీస్ మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు

Australia Women Cricketers: ఎదుర్కోవడం దేశం మొత్తానికి అవమానం. ఇది కేవలం ఒక సంఘటన కాదు, మన విలువల పతనం, భద్రతా వ్యవస్థల వైఫల్యం, మానవతను మర్చిపోయిన మృగత్వానికి నిదర్శనం. ఇండోర్‌లో జరిగిన ఈ ఘటన మనందరికీ ప్రశ్న. మహిళలకు రక్షణ కల్పించలేకపోవడం దేశానికి ప్రమాద ఘంటికలు మోగినట్టే..
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఆడటానికి భారతదేశంలో ఉన్న ఇద్దరు ఆస్ట్రేలియా క్రీడాకారిణులు గురువారం తమ హోటల్ నుండి కేఫ్‌కు నడుచుకుంటూ వెళుతుండగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే మహిళా క్రికెటర్లు SOS నోటిఫికేషన్ పంపారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు భద్రతా మేనేజర్ డానీ సిమ్మన్స్ గురువారం సాయంత్రం MIG పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు తర్వాత, పోలీసులు FIR నమోదు చేసి, సంఘటన సమయంలో బైక్‌పై ఉన్న నిందితుడు అకీల్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా మహిళా జట్టులో భాగమైన క్రీడాకారిణులు, వారి జట్టులోని మిగిలిన వారితో పాటు రాడిసన్ బ్లూ హోటల్‌లో బస చేశారు. గురువారం ఉదయం ఖజ్రానా రోడ్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో పాల్గొన్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
ఇద్దరు క్రికెటర్లు తమ హోటల్ నుండి బయటకు వచ్చి ఒక కేఫ్ వైపు నడుచుకుంటూ వెళుతుండగా, మోటార్ సైకిల్‌పై ఒక వ్యక్తి వారిని వెంబడించాడని, సబ్-ఇన్‌స్పెక్టర్ నిధి రఘువంశీ చెప్పారు. క్రికెటర్లను నిందితుడు అనుచితంగా తాకినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆ తర్వాత అక్కడి తప్పించుకొని వెళ్లిపోయరన్నారు. ఆ ఇద్దరు తమ జట్టు భద్రతా అధికారి డానీ సిమ్మన్స్‌ను సంప్రదించడంతో, వెంటనే రక్షణగా సిబ్బందితోపాటు వెహికల్ పంపించామన్నారు.
సమాచారం అందుకున్న తర్వాత, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ హిమాని మిశ్రా ఇద్దరు ఆటగాళ్లను కలిసి, వారి వాంగ్మూలాలను నమోదు చేసి, MIG పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 74 కింద కేసు నమోదు చేశారు. మ్యాచ్ వీక్షించిన అనుమానితుడి మోటార్ సైకిల్ నంబర్‌ను గుర్తించాడని, దాని ఆధారంగా నిందితుడు అకీల్ ఖాన్‌ను అరెస్టు చేశామని తెలిపారు. ఖాన్‌పై గతంలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని దర్యాప్తు కొనసాగుతోందని ఆమె చెప్పారు.



