ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదం

కృష్ణా జిల్లా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టులోని కస్టమ్స్ అధికారుల గదిలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో కస్టమ్స్ అధికారుల లగేజీ బ్యాగులు, ఏసీ ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. అధికారులు స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.



