News
Chandrababu: ప్రపంచాన్ని మెప్పించే శక్తి మహిళలకు ఉంది

Chandrababu: ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. మహిళలు ఆదాయం ఆర్జించాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని డ్వాక్రా సంఘాలు నిలబడ్డాయని తెలిపారు. మహిళలు పారిశ్రామికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.
మహిళలు వ్యాపారంలో రాణించేలా 24 సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ప్రపంచాన్ని మెప్పించే శక్తి మహిళలకు ఉందన్నారు. అరకు కాఫీకి పాతికేళ్ల క్రితమే బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చానని అన్నారు. మహిళలు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే బాధ్యత నాదేనని చంద్రబాబు తెలిపారు.