జాతియం

PSLV C-60: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ- సీ 60

PSLV C-60: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ PSLV C-60 రాకెట్‌ దూసుకెళ్లనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాత్రి 9 గంటల 58 నిమిషాలకు రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తికాగా నిన్న రాత్రి 8 గంటల 58 నిమిషాల నుంచి కౌంట్‌డౌన్‌ కూడా ప్రారంభమైంది. సుమారు 25 గంటల పాటు కౌంట్‌డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ రాకెట్‌ ద్వారా స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు రోదసీలోకి పంపనున్నారు .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button