Minister Anitha: ఏపీ హోం మంత్రి పీఏ జగదీష్‌పై వేటు

Minister Anitha: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రైవేటు పీఏ జగదీశ్‌పై వేటు పడింది. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సులు వంటి వాటి కోసం వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. జగదీశ్ పదేళ్లుగా అనిత వద్ద పీఏగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అనిత హోంమంత్రి అవడంతో ఆయన అవినీతి పెచ్చుమీరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంత్రి తర్వాత అన్నీ తానే అన్నట్టుగా చక్కబెడుతున్నట్టు తెలిసింది. మద్యం దుకాణాల్లో వాటాల కోసం లైసెన్స్ దారులపై ఒత్తిడి, హోంమంత్రికి సంబంధించిన తిరుమల దర్శనం సిఫార్సు లేఖలను తిరుపతిలోని ఓ హోటల్‌కు గంపగుత్తగా అమ్ముకోవడం వంటి ఆరోపణలు కూడా జగదీశ్‌పై ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అనిత ఆయనను తొలగించారు. హోం మంత్రి పిఏ జగదీష్ తొలగింపు విషయం తెలియగానే సంబరాలు చేసుకున్న టిడిపి నాయకులు.