ఆంధ్ర ప్రదేశ్

నేడు కృష్ణా జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన

ఇవాళ మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. దెబ్బ తిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్‌ పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వైఎస్‌ జగన్‌ను కలవకుండా రైతులపై ఆంక్షలు విధిస్తోంది. జనాన్ని రాకుండా అడ్డుకోవడానికి వందల మంది పోలీసులు మోహరించారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ఆయన మాట్లాడనున్నారు.

రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ పోలీసులు షరతులు విధించారు. కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలు పెట్టారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆంక్షలు విధించిన పోలీసులు.. వైఎస్‌ జగన్‌ పర్యటనకు రావొద్దంటూ వైసీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులకు నోటీసులు ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button