News
మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అరెస్ట్

వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మద్ బాషాను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లుక్ అవుట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో అహ్మద్ బాషాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం కడప పోలీసులకు అప్పగించారు. ముంబై నుండి బెంగళూరు బెంగళూరు నుండి కడపకు తరలించారు పోలీసులు. కడపలోని వినాయకనగర్ స్థలం విషయంలో దాడి చేసినట్లు అహ్మద్ బాషాపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఇక కడప కోర్టులో నేడు అహ్మద్ బాషాను హాజరు పరిచే అవకాశం కన్పిస్తోంది.