తెలంగాణ
Traffic Challans: ట్రాఫిక్ చలాన్లపై రాయితీ వార్తలను ఖండించిన పోలీసులు

Traffic Challans:పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఖండించారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీ లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం మరోసారి రాయితీ ఇచ్చిందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. రాయితీ వంటి అంశాలు ఉంటే తాము ముందుగానే ప్రకటిస్తామని వెల్లడించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.