తెలంగాణ
CP Sajjanar: అర్ధరాత్రి సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు..రౌడీషీటర్లకు వార్నింగ్

CP Sajjanar: హైదరాబాద్‌లో సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ అర్థరాత్రి గస్తీ నిర్వహించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా లంగర్ హౌస్ పీఎస్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీల్లో సీపీ సజ్జనార్ రౌడీషీటర్ల ఇళ్లలోకి వెళ్లారు. రౌడీషీటర్లను నేర చరిత్ర ప్రస్తుత జీవనశైలిపై సీపీ ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగులు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



