తెలంగాణ
Hyderabad: మీర్‌పేట్‌లో కారు బీభత్సం.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Hyderabad: హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధాతు నగర్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అనంతరం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు ప్రయాణికులు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కారు పూర్తిగా ధ్వంసమైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



