తెలంగాణ
ఈ నెల 30న సిరిసిల్ల వేదికగా సీఎం రేవంత్ సభ

సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ నెల 30న సిరిసిల్ల వేదికగా సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం సభ ఏర్పాట్లను వేగవంతం చేస్తుండగా.. కాంగ్రెస్ శ్రేణులు భారీ జన సమీకరణపై దృష్టి సారించాయి. గతంలో సిరిసిల్ల భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈసారి సభలోనూ ఆ అంశం ప్రస్తావనకు వస్తుందా? ప్రత్యర్థులపై సీఎం ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు? అన్న చర్చ సాగుతోంది.
ఇప్పటికే భూ వ్యవహారంపై ఆధారాలు చూపించాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. సీఎం సభలో చేసే వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది. ఈ నెల 30న జరగనున్న సీఎం సభపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.



