Tirupati: అర్ధరాత్రి నర్సింగ్ హాస్టల్లో దూరిన ప్రిన్సిపాల్.. నిర్భంధించిన విద్యార్థినులు

Tirupati: తిరుపతిలోని వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ వర్మకు కొందరు వ్యతిరేకంగా మరికొందరు విద్యార్థినులు సపోర్టింగ్‌గా నిలుస్తున్నారు. అర్ధరాత్రి విద్యార్థినుల గదిలోకి ప్రిన్సిపాల్ వర్మ చొరబడ్డారని అందుకే ప్రిన్సిపాల్ వర్మని నిర్భందించామంటున్నారు విద్యార్థినులు. కాదు కాదు పక్క భవనంలోకి దూకిన విద్యార్థిని నిలదీసిన ప్రిన్సిపాల్‌పై ఆరోపణలు చేస్తున్నారంటున్న మరికొంత మంది స్టూడెంట్స్.
అంతేకాదు రాత్రి సమయాల్లో బయటకు వెళ్తున్నవారిని, కట్టడిచేసేందుకే ప్రిన్సిపాల్‌ని పిలిచామంటున్న స్టూడెంట్స్. అటు ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మరికొంత మంది విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రిన్సిపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ విద్యార్థిని. ప్రస్తుతం ప్రిన్సిపాల్ వర్మ అలిపిరి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.