Allu Arjun: అల్లు అర్జున్ - అట్లీ పాన్ వరల్డ్ సినిమా సంచలనం

Allu Arjun: సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్! అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రాబోతోంది. కోలీవుడ్ బిగ్ బ్యానర్ సన్ పిచర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా అధికారికంగా ప్రకటించిన మేకర్స్ ఓ స్టన్నింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. అది చూస్తే ఇది కేవలం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ అని అర్థమవుతోంది. మరి ఈ సినిమా స్పెషల్ ఏంటో తెలుసుకుందాం!
అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ సినిమా, అట్లీ దర్శకత్వంలో 6వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోంది. బన్నీ, అట్లీ ఇప్పటికే అమెరికా వెళ్లి స్పైడర్‌మ్యాన్, అవతార్ వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ VFX, మోషన్ స్టూడియోస్ టీమ్‌తో లుక్ టెస్ట్‌లు జరిపారు.
విజువల్స్, థీమ్ చూస్తే ఇది హాలీవుడ్ సినిమాలను ఢీకొట్టే స్థాయిలో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సన్ పిచర్స్ బ్యానర్‌లో వస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోతోనే సినీ ప్రియుల్లో సంచలనం సృష్టించిన బన్నీ, అట్లీ ఈ సినిమాతో ఏ రేంజ్ రికార్డులు బద్దలు కొడతారో చూడాలి.