అంతర్జాతీయం

Donald Trump: ఉక్రెయిన్ కంటే రష్యాతో డీల్ ఈజీ

Donald Trump: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో కంటే రష్యాను డీల్ చేయడమే చాలా ఈజీ అన్నారు ట్రంప్. ఇందుకు పుతిన్‌‌తో తనకు ఉన్న సంబంధాలే కారణమన్నారు ట్రంప్. మొత్తానికి ఉక్రెయిన్‌తో ఒప్పందంపై చర్చించడమే కష్టంగా ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రస్తుతానికి కీలక నిర్ణ యాలు తీసుకునే స్థితిలో జెలెన్ స్కీ సిద్ధంగా లేడని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు ట్రంప్ వ్యాఖ్యల వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌తో తాత్కాలిక ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా వెల్లడించింది. అయితే యుద్ధం ముగించడానికి కొన్ని షరతుల మేరకు తాత్కిలిక ఒప్పందం చేసుకుంటామని ప్రకటించింది రష్యా. ఇరు దేశాల మధ్య మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి తాము తీవ్రంగా ప్రయత్నిసున్నట్లు ట్రంప్ చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button