తెలంగాణ

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.. కార్తీక మాసం.. అందులోనూ ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.. తెల్లవారుజాము నుంచే కొండపై భక్తుల రద్దీ నెలకొంది.. స్వామివారి దర్శనంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు.. పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు.

స్వామివారి నామస్మరణతో యాదాద్రి ఆలయ ప్రాంగణం మార్మోగింది.. భక్తుల రద్దీ పెరగడంతో ఉచిత దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది.. మరోవైపు ఆలయ పరిసరాలు, ప్రసాదం కౌంటర్లు, పుష్కరిణి, పార్కింగ్ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button