అంతర్జాతీయం
జపాన్లో భారీ విస్ఫోటనం!

జపాన్లో అగ్నిపర్వతం ఉగ్రరూపం దాల్చింది. సకురాజిమా అగ్నిపర్వతం బద్దలవడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. అగ్నిపర్వతం నుంచి భారీగా పొగ, బూడిద ఆకాశంలోకి ఎగసిపడింది. దాదాపు వెయ్యి మీటర్ల ఎత్తుకు బూడిద మేఘాలు విస్తరించాయి.
అప్రమత్తమైన అధికారులు లెవల్-3 హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. అగ్నిపర్వతం పరిసర ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లకుండా ప్రవేశ ఆంక్షలు విధించారు. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద, ఇతర ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.



