తెలంగాణ
బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి

హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ముగిసింది. ఈ ఏడాది లడ్డూను సామ ప్రణీత్ రెడ్డి 39 లక్షలకు దక్కించుకున్నారు. భారీ పోటీ మధ్య జరిగిన వేలంలో 39 లక్షల ధర పలకడంతో బాలాపూర్ గణేశ్ లడ్డూ మరోసారి రికార్డు సృష్టించింది. ప్రతిష్టాత్మకంగా భావించే బాలాపూర్ లడ్డూను దక్కించుకునేందుకు పలువురు పోటీ పడగా చివరికి 39 లక్షలతో సామ ప్రణీత్ రెడ్డి సొంతం చేసుకున్నారు.



