తెలంగాణ
Revanth Reddy: నర్సు హత్యాచార ఘటనపై సీఎం రేవంత్ సీరియస్!

Revanth Reddy: హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో ప్రైవేట్ ఆసుపత్రి నర్సు హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, మహిళా ఉద్యోగుల భద్రతా ఏర్పాట్లు, సంస్థ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే అంశాలపై సమగ్ర మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పకడ్బందీగా దర్యాప్తు పూర్తి చేసి త్వరగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని సూచించారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.



