జాతియం
విపక్షాల తీరుపై కేంద్రహోంమంత్రి అమిత్షా ఆగ్రహం

పార్లమెంట్లో ప్రతిపక్షాల తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల విమర్శలు, ఆరోపణలపై పార్లమెంట్ వేదికగా దీటుగా బదులిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు తాము నేరుగా సభకు వెళ్లి అన్ని విషయాలపై వివరంగా మాట్లాడుతామని, ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతీ ఒక్క ప్రశ్నకు బహిరంగంగా సమాధానం ఇస్తానని అమిత్ షా సవాల్ విసిరారు. అంతేకాకుండా, దీనిపై సభలో సుదీర్ఘ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలుపెట్టి, రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు అంటే ఏకంగా 24 గంటల పాటు నిరంతర చర్చకు సిద్ధమని అమిత్ షా తేల్చిచెప్పారు. పార్లమెంట్లో చర్చను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది



