ఆంధ్ర ప్రదేశ్
Konaseema Collector: కోనసీమ జిల్లా కలెక్టర్‌కు తప్పిన పెను ప్రమాదం

కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీలు సందర్భంగా ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద ట్రైల్ రన్లో భాగంగా కాయ్ కింగ్ పడవను నడిపారు కలెక్టర్ మహేష్. అయితే కాయ్ కింగ్ పడవ ఒక్కసారిగా అదుపు తప్పడంతో కలెక్టర్ సహా ఆయన వెనక ఉన్న అతను నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, గజ ఈత గాళ్లు కలెక్టర్‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.



