సినిమా

కీర్తి సురేష్ ఆందోళన!

Keerthy Suresh: నటి కీర్తి సురేష్ ఏఐ దుర్వినియోగం బారిన పడ్డారు. తనను పోలి ఉన్న ఏఐ ఫోటోలు వైరల్ కావడంతో ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ టెక్నాలజీపై నియంత్రణలు అవసరమని డిమాండ్ చేశారు. మహిళల డిజిటల్ భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం బారిన పడిన సెలబ్రిటీల జాబితాలో కీర్తి సురేష్ కూడా చేరిన సంగతి తెలిసిందే. తనను పోలి ఉన్న ఏఐ జనరేటెడ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కీర్తి సురేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫొటోలు తన ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీని సానుకూలంగా వాడితే మంచి టూల్ కానీ, ప్రస్తుతం నిదానం లేకుండా దుర్వినియోగం జరుగుతోందని కీర్తి పేర్కొన్నారు.

ఏఐ ద్వారా మహిళల గుర్తింపును దెబ్బతీసేలా చిత్రాలు తయారవుతున్నాయని, ఇలాంటి దుర్వినియోగంపై కఠిన నిబంధనలు అవసరమని డిమాండ్ చేశారు. డిజిటల్ భద్రత, మహిళల గౌరవం వంటి అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రమాదకరంగా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్వినియోగం తగ్గించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కీర్తి సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button