ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: పవన్ కల్యాణ్ చొరవ.. ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ వెలుగులు

Pawan Kalyan: చిమ్మ చీకటిలో జీవనం సాగించిన తమకు కూటమి ప్రభుత్వం వెలుగులు నింపిందని గూడెం ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని గూడెం ప్రజల ఇళ్లకు ఎట్టకేలకు విద్యుత్ కనెక్షన్లు అందుబాటులోకి వచ్చింది.
విద్యుత్ వెలుగులు లేక అజ్ఞాతంలో ఉన్న తమ పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ మాకు విద్యుత్ కనెక్షన్లు అందేలా చూశారన్నారు. తమ గ్రామానికి విద్యుత్ అందించిన డిప్యూటీ సీఎంకు రుణపడి ఉంటామన్నారు.



