ఆంధ్ర ప్రదేశ్
మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం

తుని అత్యాచారయత్నం కేసులో నిందితుడు నారాయణ రావు సూసైడ్ చేసుకున్నాడు. నిందితుడు నారాయణరావు తుని కోమటి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకొని వెళ్తుండగా నారాయణ రావు వాష్ రూమ్ కోసం వెహికల్ ఆపమన్నాడని పోలీసులు చెబుతున్నారు.
పోలీస్ వెహికల్ ఆగిన వెంటనే తప్పించుకుని సమీపంలో ఉన్న చెరువులో దూకాడని పోలీసుల తెలిపారు. నారాయణరావు మృతదేహాన్ని వెలికితీశారు. నారాయణరావు నిన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు.



