తెలంగాణ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నగర మోగింది. సిరిసిల్ల జిల్లాలో మొదటి విడతలో ఏడు మండలాల్లోని 65 ఎంపీటీసీ స్థానాలు, ఏడు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బోయిన్పల్లి, చందుర్తి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట్, రుద్రంగి, ఇల్లంతకుంట మండలాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది.



