ఆంధ్ర ప్రదేశ్

పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌తో సందడి!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. రాజమహేంద్రవరంలో టూరిజం ప్రాజెక్ట్ శంకుస్థాపనకు షర్ట్, ప్యాంట్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా కొత్త లుక్‌లో అభిమానులను ఆశ్చర్యపరిచారు. రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన షర్ట్, ప్యాంట్‌లో స్టైలిష్‌గా హాజరయ్యారు. ఇప్పటివరకు వైట్ కుర్తా పైజామాలో కనిపించిన పవన్, ఈ సరికొత్త లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల విజయవాడలోని పెనమలూరు మండలంలో ‘కొనిక’ సెలూన్ ప్రారంభోత్సవానికి టీషర్ట్, షార్ట్‌లో సింపుల్‌గా వచ్చిన పవన్, కొత్త హెయిర్ స్టైల్‌తో సందడి చేశారు. సన్నిహితుడైన సెలూన్ ఓనర్ కోసం ఆయన ప్రత్యేకంగా హాజరవడం విశేషం. పవన్ ఈ కొత్త లుక్‌ను కొనసాగిస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button