The Raja Saab: ది రాజా సాబ్’ రిలీజ్ ఎప్పుడంటే?

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి భారీ అప్డేట్ రానుంది. టీజర్ విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ప్రభాస్ అభిమానులకు శుభవార్త! దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం నుంచి రెండు వారాల్లో కీలక అప్డేట్ రానుంది. ఈ సినిమా టీజర్ త్వరలో విడుదల కానుందని, దాని తేదీపై స్పష్టత రానుందని తెలుస్తోంది. 2025 డిసెంబర్ 5న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని పుకార్లు వినిపిస్తున్నాయి, అయితే అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.