‘పెద్ది’పై వివాదాస్పద వ్యాఖ్యలకు విశ్వక్ సేన్ ఫైర్?

Vishwak Sen: రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ఓ యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై నటుడు విశ్వక్ సేన్ తీవ్రంగా స్పందించాడు. ఆ యూట్యూబర్‌ను పరిశ్రమకు పారాసైట్ అని విమర్శించాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
మార్చి 27న ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ రివ్యూవర్ సినిమా కథ తెలుసన్నట్టు మాట్లాడుతూ విమర్శలు చేశాడు. దీనిపై విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించాడు. ఇలాంటి వారు సినీ పరిశ్రమకు పారాసైట్లని ఆరోపించాడు. పరిశ్రమ వల్లే జీవిస్తూ ఆ పరిశ్రమనే దెబ్బతీసే ప్రయత్నం తప్పని ఘాటుగా విమర్శించాడు.



