తెలంగాణ
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం కదులుతూ బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో మరిన్ని కుంభవృష్టి వానలు పడనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వీటితోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.



